కిసాన్ స‌మృద్ధి కేంద్రాల‌తో రైతుల‌కు మ‌రిన్ని సేవ‌లు

కోర‌మాండల్ సీనియ‌ర్ జోన‌ల్ మేనేజ‌ర్ స‌జ‌న్‌కుమార్

More services to farmers with Kisan Samriddhi Kendras : ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మృద్ధి కేంద్రాల ద్వారా రైతుల‌కు మ‌రిన్ని సేవ‌లు అందుతాయ‌ని కోర‌మాండల్ సీనియ‌ర్ జోన‌ల్ మేనేజ‌ర్ స‌జ‌న్‌కుమార్ తెలిపారు. జనగాం జిల్లా పటేల్ గూడెంలో ప్రధానమంత్రి కిసాన్ సేవ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రైతులు, ఈ ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మృద్ధి కేంద్రాల్లో కోరమాండల్ బృందం మద్దతుతో, సరైన సమయంలో భూసార పరీక్ష, ఎరువులు ల‌భిస్తాయ‌ని చెప్పారు. మంచి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేయాలో కోరమాండల్ బృందం రైతులకు సలహా ఇస్తుందని స‌జ‌న్ కుమార్ స్ప‌ష్టం చేశారు. రైతులకు సాయం చేస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారం కూడా రైతులకు అందుతుందని ఆయ‌న వెల్ల‌డించారు. అంతేకాకుండా, ఈ PMKSK ఆధ్వ‌ర్యంలో రైతుల‌కు శిక్షణ కార్యక్రమాలు సైతం న‌డుస్తాయ‌న్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా మేనేజర్ శ్రీధర్ రెడ్డి స్థానిక డీలర్లు శ్రీధర్, కంపెనీ వ్యవసాయ శాస్త్రవేత్త వెంకన్న రైతులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like