మోసపూరిత ప్రయత్నాలు చేస్తే జైలుకే

-ఎస్ఐ ప‌రీక్ష‌ల‌కు అంతా సిద్ధం
-పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
-నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించరు
-ద‌ళారుల మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌న్న ఇన్‌చార్జీ సీపీ స‌త్య‌నారాయ‌ణ‌

ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం ఉద‌యం రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రిలిమినరీ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. నిమిషం అలస్యమైన ఎగ్జామ్ హాల్ కి అనమతించమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామ‌ని రామ‌గుండం ఇన్‌చార్జీ కమిష‌న‌ర్ స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. విద్యార్థులు 9గంటల కల్లా ఎగ్జామ్ హాల్ కు చేరుకోవాలని సూచించారు. OMR షీట్స్ పై ఎలాంటి రాతలు రాసిన ఆన్సర్ షీట్ గా పరిగణించమని..బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ మాత్రమే తెచ్చుకోవాలని సూచించారు. ఎగ్జామ్ కి వచ్చే అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి మెహందీ, టెంపరరీ టాటూలు ఉండకుండా చూసుకోవాలన్నారు.

మోసపూరిత ప్రయత్నాలు చేస్తే జైలుకే
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామ‌ని ఇన్‌చార్జీ సీపీ స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ , ఇంటర్ నెట్ సెంటర్స్ , చుట్టు ప‌క్క‌ల‌ లౌడ్ స్పీకర్లు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి 1 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని కోరారు. ఎలాంటి అపోహలకు, పుకార్ల‌ను న‌మ్మ‌కుండా విజయం సాధించాలన్నారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఏవైనా మోస‌పూరిత ప్ర‌య‌త్నాలు చేస్తే ఖ‌చ్చితంగా జైలుకి పంపుతామ‌ని హెచ్చ‌రించారు.

దళారుల మాటలు నమ్మి పోసవద్దు
ప‌రీక్ష‌లు రాసే యువత దళారుల మాటలు నమ్మి పోసవద్దని ఇన్‌చార్జీ సీపీ సత్యనారాయణ సూచించారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి పరీక్ష లు నిర్వహిస్తున్నందున పరీక్షల నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందన్నారు. కొంద‌రు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారని దళారుల మాటలు నమ్మిమోసపోవద్దన్నారు. డబ్బులు ఇచ్చి నష్టపోవద్దన్నారు. ఎస్సై మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా మధ్యవర్తుల ద్వారా రాదన్నారు. ప్రలోభాలకు గురి కావద్దని , ఉద్యోగాల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుందని సీపీ స‌త్య‌నారాయ‌ణ వెల్ల‌డించారు. ఎంపిక పరీక్ష నుండి చివరి రాత పరీక్ష వరకు అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపీక ఉంటుందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like