ఎంపీ న్యూడ్ వీడియో… కోటి రూపాయ‌లంట‌…

ఒక ఎంపీ న‌గ్నంగా ఉన్న వీడియో… అది కూడా నిజ‌మో, మార్ఫింగ్‌దో తెలియ‌దు.. కానీ, ఆ వీడియోకు కోటి రూపాయ‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి పార్టీతో పాటు, సొంత పార్టీ వారు సైతం ఆ వీడియో కావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంట‌.. ఎందుకంటే…

వైఎస్ఆర్ ఎంపీ గోరంట్ల మాధవ్ దిగా చెబుతున్న ఓ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది అస‌లు ఆయ‌న వీడియోనే…? కాదా..? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆ వీడియోను పొందడానికి మాత్రం పలువురు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కోసం కోటి రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. దాని కోసం రాయలసీమకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో పాటు, ఆయ‌న పార్టీలోనే ఉన్న ఆయ‌న ప్రత్యర్థులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అయితే అది మార్ఫింగ్ చేసిన వీడియో అని ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్నారు. జిమ్లో తాను ఎక్సర్ సైజ్ చేస్తున్నప్పుడు వీడియో తీసి, దాన్ని మార్ఫింగ్ చేశారని ఆయ‌న ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. తనను రాజ‌కీయంగా దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం పార్టీ నేత‌లు కుట్ర చేశారని, అందుకు మార్ఫింగ్ చేసిన వీడియోను బయటపెట్టారని గోరంట్ల చెబుతున్నారు. తప్పు చేసినట్లు తేలితే గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like