ఫ్లాష్‌… ఫ్లాష్‌.. ముఖ్య‌మంత్రిపై దాడికి య‌త్నం

సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి ఏకంగా ముఖ్యమంత్రిపైనే దాడి చేశాడు ఓ యువకుడు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై జ‌రిగిన దాడి భ‌ద్ర‌తా వైఫ‌ల్యాలను ఎత్తి చూపింది. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో సీఎం నితీశ్ కుమార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ దాడికి సంబంధించి విజువ‌ల్స్ వెలుగులోకి వ‌చ్చాయి. స్థానిక సఫర్ హాస్పిటల్ కాంప్లెక్స్‌లో బీహార్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో దాడి జరిగింది. వెనుక నుండి వచ్చిన వ్యక్తి, వేగంగా అడుగులు వేస్తూ వేదికపైకి నడుస్తూ, విగ్రహానికి పుష్పాంజలి ఘటించేందుకు వంగి ఉన్న ముఖ్య‌మంత్రిని కొట్టారు. వెంటనే ఆ యువ‌కున్ని ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఈడ్చుకెళ్లారు.

గ‌తంలో సైతం నితీశ్ కుమార్‌పై దాడికి య‌త్నించారు. నవంబర్ 2020లో బీహార్‌లోని మధుబనిలో జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నప్పుడు హర్లాఖిలో జరిగిన ర్యాలీలో ఉద్యోగాల గురించి మాట్లాడుతుండగా, గుంపు నుండి ఉల్లిపాయలు విసిరేశారు. అతని భద్రతా సిబ్బంది అతని చుట్టూ రక్షణ కవచంలా నిల‌బ‌డంతో ఆయ‌న‌కు ఏం కాలేదు. ఇప్పుడు ఆ యువ‌కుడు భ‌ద్ర‌తాసిబ్బందిని దాటుకుని మ‌రీ దాడిచేయ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. దీనిపై ఉన్న‌త‌స్థాయి ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ దాడి ఖండించారు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్య మార్గాల ద్వారా నిరసన తెలియజేయాలని ప్రజలను కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like