నాలుగు బొగ్గు బ్లాక్‌లు : టెండ‌ర్లు ప‌డ‌లే…

మంచిర్యాల : సింగ‌రేణి ప్రాంతంలోని ఆ నాలుగు బ్లాక్‌ల‌కు ఎలాంటి టెండ‌ర్ ప‌డ‌లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సత్తుపల్లి బ్లాకు-3, కోయగూడెం బ్లాక్-3, శ్రావణపల్లి-3, కేకే-6 గనులను కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటించిన విష‌యం తెలిసిందే. కేంద్రం వేలంలో పెట్టిన ఈ బ్లాక్‌ల‌కు ఎలాంటి టెండ‌ర్ రాక‌పోవ‌డంతో తిరిగి వాటిని సింగ‌రేణికే కేటాయించే అవ‌కాశం ఉంది. గతంలో నిర్వహించిన టెండర్లలో కేవలం కోయగూడెం ఓసీపీ-3కి ఒకే ఒక టెండరు నమోదైంది. సింగిల్ టెండర్‌ అనుమతించే అవకాశం లేకపోవడంతో మళ్లీ నాలుగు గనులకు టెండర్లు ఆహ్వానించింది. ఈ నాలుగు బొగ్గు బ్లాకులకు ఇప్పటివ రకు ఒక్క టెండరు కూడా పడకపోవడంతో తమకే వస్తాయన్న నమ్మకంతో సింగరేణి ఉంది. సింగరేణి సంస్థ 12 బొగ్గు బ్లాకులకు సంబంధించి అన్వేషణ పనులు పూర్తి చేసింది. నాలుగు బొగ్గు బ్లాకుల ద్వారా 300 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులోకి రాను న్నాయి. ఈ బొగ్గు గనుల్లో 300 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వీటిని సింగరేణికి కేటాయిస్తే ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవ కాశం ఉంది. ప్రస్తుతం కేంద్రం నిర్వహించిన వేలంలో నాలుగు బొగ్గు బ్లాకులకు ఇప్పటి వరకు. ఎవరూ వేలంలో పాల్గొనకపోవడంతో తిరిగి సింగ రేణికి కేటాయించే అవకాశం ఉంది. మూడు సార్లు ఎవరు వేలంలో పాల్గొనకపోతే వాటిని తిరిగి ఆ సంస్థకే కేటాయించే అవకాశం ఉండటంతో సింగ రేణి యాజమాన్యం వీటిపైనా ఆశలు పెంచుకుంది. ముఖ్యంగా కోయగూడెం బ్లాకుని, సత్తుపల్లి బ్లాక్ పనులు చేసుకునే అవకాశం ఉంది. వీటి ద్వారా ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. భూసేకరణ అవసరం ఉంటే సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఈ రెండు గనులకు సింగరేణి స్థలం ఉండ టంతో భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. దీంతో రైతుల నుంచి పరిహారం, వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోవడంతో వీటిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టడం సులువుగా సింగరేణి భావిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like