న‌లుగురు మ‌హిళా దొంగ‌ల అరెస్టు

-దృష్టి మ‌ళ్లించి బంగారం షాపుల్లో దొంగ‌త‌నాలు
-సిబ్బందికి క్యాష్ రివార్డు అందించిన ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్

మంచిర్యాల : బంగారం షాపుల్లో యజమానుల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న న‌లుగురు మహిళా దొంగ‌ల‌ను అరెస్టు చేశారు. మంచిర్యాల ఇన్‌చార్జి డీసీపీ అఖ‌ల్ మ‌హాజ‌న్‌, ఏసీపీ ఎడ్ల మ‌హేష్ నిందితుల వివ‌రాలు వెల్ల‌డించారు.

ఖ‌మ్మం జిల్లా రాయ‌ప‌ట్నానికి చెందిన‌ బాలసాని వెంకటరమణ, బొజ్జ‌గాని నాగేoద్రమ్మ, బొజ్జ‌గాని దీనమ్మ మేచర్ల రేణుక అనే మ‌హిళ‌లు దొంగ‌త‌నాల‌కు అల‌వాటు ప‌డ్డారు. 15 ఏండ్లుగా ఈ దొంగ‌త‌నాలు చేస్తున్నారు. బంగారం దుకాణాల‌కు క‌స్ట‌మ‌ర్ల‌లాగా వెళ్లి న‌గ‌లు చూపించ‌మ‌ని అడుగుతారు. వీరి వ‌ద్ద అంత‌కుముందు సిద్ధంగా ఉన్న న‌కిలీ బంగారం వ‌స్తువుల‌ను మార్చేస్తారు. అలా దొంగలించిన వస్తువులను నలుగురు సమనoగా పంచుకుంటారు.

బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో వెంకటసాయి జువెల్ల‌రీలో కమ్మలు చూపించమని చెప్పి వీరి దగ్గ‌ర ఉన్న నకిలీ వాటిని వారి ట్రేలోకి మార్చుతూ తొమ్మిది జతల కమ్మలను దొంగిలించారు. వెంకటరమణ 3 జతలు తీసుకుని మిగిలిన వాటిని తల 2 జతల చొప్పున సమానంగా పంచుకొన్నారు.మ‌ళ్లీ గురువారం దొంగ‌త‌నం చేసేందుకు బెల్లంప‌ల్లికి వ‌చ్చారు. వీరు అనుమాన‌స్ప‌దంగా కనిపించ‌డంతో పోలీసులు ప‌ట్టుకుని విచారించారు.

ఈ నెల 5న బంగారం షాపు య‌జ‌మాని కొలిపాక అరవింద్ త‌న షాపులో దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లు గుర్తించారు. తన గోల్డ్ షాప్ లో స్టాక్ చెక్ చేస్తుండగా తొమ్మిది కమ్మల జతలు తేడాగా కనిపించగా వాటిని పరిశీలించగా అవి న‌కిలీవ‌ని తేలింది. సీసీ ఫుటేజీ ప‌రిశీలించ‌గా నలుగురు ఆడ వాళ్ళు అస‌లు స్థానంలో నకిలీ కమ్మలు పెట్టినట్లుగా గుర్తించామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీ లోని వారి ముఖం ఆధారంగా గురువారం అదుపులోకి తీసుకున్న వారు ఒక్క‌రే అని తేలింది. గత నెలలో బంగారం షాప్ లో దొంగతనం చేసింది తామేనని వారు ఒప్పుకున్నారు.

ఈ మేర‌కు వారిని అరెస్టు చేసి రిమాండ్ త‌ర‌లించారు. మహిళా దొంగలని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మాదారం ఎస్సై హైమ, సిబ్బంది సంపత్ కుమార్,మల్లేష్, మహిళా హోంగార్డ్ సౌజన్యను మంచిర్యాల ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్, బెల్లంప‌ల్లి ఏసీపీ మహేష్ అభినందించి క్యాష్ రివార్డ్ ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like