కార్మికులకు ద్రోహం చేసిన జాతీయ కార్మిక సంఘాలు

కార్పొరేట్ చర్చల ప్రతినిధి ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి

National trade unions that betrayed the workers: జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల‌కు ద్రోహం చేశాయ‌ని కార్పొరేట్ చర్చల ప్రతినిధి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 11వ వేజ్ బోర్డులో 19 శాతం జీతాలు పెంచుతూ మోసపూరితమైన అగ్రిమెంట్ చేసుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేజ్ బోర్డులో 50% జీతాలు పెరుగుదల కోసం డిమాండ్ చేస్తామ‌ని చెప్పి కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించి, యాజమాన్యానికి లొంగిపోయి 19 శాతం కు ఒప్పందం చేయడం ఏమిట‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతాలు పెంచకుండా అంకెల గారడీతో కార్మికులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. హేతుబద్ధతలేని డిమాండ్లు పెట్టడం యజమాన్యానికి లొంగిపోయి తప్పుడు అగ్రిమెంట్లు చేసుకోవ‌డం జాతీయ కార్మిక సంఘాలకు అలవాటుగా మారిందన్నారు. కనీసం మెరుగైన అలవెన్సుల‌తో కూడిన‌ అగ్రిమెంట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తప్పుడు ఒప్పందం చేసిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు గనుల పైకి వచ్చినప్పుడు నిలదీయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like