న్యూయార్క్ లో గణేష్ వాడ..

అమెరికాలో ఓ వీధికి గ‌ణేస్ టెంపుట్ స్ట్రీట్ అని నామ‌క‌ర‌ణం చేశారు. న్యూయార్క్‌లో ప్రముఖ దేవాలయం ఉన్న వీధికి ‘Ganesh Temple Street’ అని నామకరణం చేశారు. ఈ దేవాలయాన్ని 1977లో స్థాపించారు. ఆ ప్రాంతంలో ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా శ్రీ మహా వల్లభ గణపతి దేవస్థానం నెల‌కొల్పింది. దీనిని గణేష్ టెంపుల్ అని పిలుస్తారు, ఇది ఉత్తర అమెరికాలోని మొట్ట మొదటి, పురాతన హిందూ దేవాలయంగా గుర్తిస్తున్నారు.

ఈ హిందూ దేవాలయం క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో ఉంది. ఈ దేవాలయం ఉన్న వీధి పేరు బౌన్ స్ట్రీట్, మతపరమైన స్వేచ్ఛ, బానిసత్వ వ్యతిరేక ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రముఖ అమెరికన్ జాన్ బౌన్ పేరును ఈ వీధికి పెట్టారు. శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, ఈ గణేష్ ఆలయ గౌరవార్థం ఆ వీధికి ‘గణేష్ టెంపుల్ స్ట్రీట్’ అని పేరును మార్చారు.

ఈ మేరకు ఓ ప్రత్యేకకార్యక్రమంలో స్ట్రీట్ గుర్తును ఆవిష్కరించారు. ఈ వేడుకలో న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్, క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, ట్రేడ్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ డిప్యూటీ కమిషనర్, దిలీప్ చౌహాన్, ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కేవలం వేడుక మాత్రమే కాదని.. ఇక్కడిదాకా చేరుకోవడానికి దశాబ్దాల సమయం పట్టిందని.. దీనివెనుక అందరి కృషి ఉందని క్వీన్స్ బోరో ప్రెసిడెంట్ అన్నారు. ఇది ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ గురించి చాలా చెబుతుంది. ఎందుకంటే మీరు మీ కోసం మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న ప్రజల జీవితాలకు ఆనందమయంగా మార్చేస్తారని అన్నారు. ఈ మేరకు రిచర్డ్స్ పూజారులు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో స్ట్రీట్ సింబల్ ఆవిష్కరించిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వేడుక బైసాకీ ఉత్సవాల్లో భాగంగా జరిగింది.

గత ఏడాది డిసెంబరులో, న్యూయార్క్ సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కౌన్సిల్‌మెన్ పీటర్ కూ అధ్యక్షతన ఉన్న కమిటీ బౌన్ స్ట్రీట్‌కు “గణేష్ టెంపుల్ స్ట్రీట్” అని పేరు పెట్టడాన్ని ఆమోదించిందని ఆలయం సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపింది. నిర్వహణ, బోర్డు సభ్యులు, ఎన్నికైన అధికారులు ప్రతి ఒక్కరూ వారి మద్దతు అందించాలని కోరింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like