నిద్ర పోయిన ప్ర‌జాప్ర‌తినిధులు.. ముందుకొచ్చిన పాత్రికేయులు..

బోథ్ పాత్రికేయుల ఆధ్వర్యంలో లైట్ ఏర్పాటు

తాము క‌లం ఝ‌ళిపించి స‌మ‌స్య ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్ల‌డ‌మే కాదు… అవ‌స‌ర‌మైతే తాము ముందుడి ఆ స‌మ‌స్య ప‌రిష్కారించేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని నిరూపించారు పాత్రికేయులు.. వివ‌రాల్లోకి వెళితే… బోథ్ ప్రాంతం నుండి విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఏవైనా పనుల నిమిత్తం కానీ అటు ఆదిలాబాద్,నాగపూర్,నిర్మల్,నిజామాబాద్,హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తారు. ఇక్క‌డ‌కు వ‌చ్చే స‌మ‌యం రాత్రివేళ‌ల్లో, అక్కడి నుంచి తిరిగి ఇంటికి చేరాలంటే సమయానికి బస్సులు లేని పరిస్థితులు. బోథ్ కి ముఖద్వారం అయిన ఎక్స్ రోడ్డు వద్ద మహిళలు, చిన్నపిల్లలతో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. అక్కడ ఒక లైట్ కూడా ఏర్పాటు చేయలేని ప‌రిస్థితి ఉంది. ఈ స‌మ‌స్య‌ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో దీనిని ప‌రిష్క‌రించేందుకు పాత్రికేయులే స్వయంగా రంగంలోకి దిగారు. చందాలు వేసుకుని మ‌రీ లైట్ ఏర్పాటు చేశారు. అంజన రాము,శ్రీనివాస్,గంగన్న,ప్రవీణ్,అనిల్,నవీన్,దినేష్రెడ్డి,పురుషోత్తం,రవి తదితరులు ఉన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవాల్సిన ప్ర‌జాప్ర‌తినిధులు నిద్ర న‌టిస్తుంటే త‌మ స‌మ‌స్య ప‌రిష్కారానికి ముందుకు వ‌చ్చిన పాత్రికేయుల‌కు ప్ర‌జ‌లు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like