నైట్ క్లబ్ లో రాహుల్ చిందులు..

క్లబ్ అంతా మసక మసకగా ఉంది. అదే విధంగా అక్కడ జోరుగా, డీజే పాటలు విన్పిస్తున్నాయి. డ్యాన్స్ కూడా చేస్తున్నారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా..? అక్క‌డ ఆ డీజే పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తున్న వారిలో ఒక పెద్ద వ్య‌క్తి కూడా ఉన్నారు. ఆయ‌నే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్త‌ చిక్కుల్లో ఇరుక్కున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం సోమవారం నేపాల్ వెళ్లిన రాహుల్..అక్కడి ఓ పబ్‌లో ఖుషీ ఖుషీగా గడుపుతూ వీడియో కంట పడ్డారు.

నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ పబ్‌లో రాహుల్ గాంధీ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాహుల్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశం కష్ట కాలంలో ఉంటే ఖాట్మండులో రాహుల్ పార్టీ చేసుకుంటున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే రాహుల్..అక్కడ పబ్ కల్చర్‌కు అలవాటు పడ్డారంటూ బీజేపీ నేతలు విమర్శించారు. రాజకీయాల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుతుందని విమర్శలు చేస్తున్నారు.

సరదాగా వెళితే తప్పేంటి అంటూ కొందరు అంటే..రాహుల్‌కి ఇంకా కుర్రతనం పోలేదంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్, రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. దేశం సంక్షోభంలో ఉంటే ప్రధాని మోదీ విదేశాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ మోదీపై చేసిన విమర్శలకు కౌంటర్‌గా ఖాట్మండు‌లో రాహుల్ గాంధీ పబ్ వీడియోను బీజేపీ నేతలు బయటకు తెచ్చారు.

ఖాట్మాండులోని ఫేమస్ క్లబ్ లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ బగ్గా షేర్ చేశారు. దీంతో ఇది వైరల్ గా మారిపోయింది. ప్రధాని దేశం కోసం, పర్యటనలు చేస్తున్నారని.. మరీ రాహుల్ గాంధీ పబ్ లో ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపీ ఐటీ కన్వీనర్ అమిత్ మాలవీయ ట్విట్టర్‌లో స్పందించారు.. “ముంబై ముట్టడిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ నైట్‌క్లబ్‌లో ఉన్నారని తెలిపారు. వీరికి పబ్ లలో పాల్గొనడం, వేరే వారిపైన విమర్శలు చేయడం మాత్రమే తెలుసని అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like