నిమిషానికి 9000 ఫుడ్‌ ఆర్డర్లు

న్యూఇయర్‌ వేళ ఇంటి భోజనానికి కాస్త విరామమిచ్చి.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకున్నారు జనం. దీంతో ఫుడ్‌ డెలివరీ యాప్‌ల పంట పండింది. శుక్రవారం రాత్రి నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు గిరాకీ పెరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో స్విగ్గీ యాప్‌కు ఏకంగా నిమిషానికి 9వేల డెలివరీలు వచ్చాయట. జొమాటోలోనూ నిమిషానికి 8వేల మందికి పైగా ఆహారం ఆర్డర్‌ చేసుకున్నట్లు ఆయా యాప్‌లు వెల్లడించాయి.

కొత్త సంవ‌త్స‌రం వేళ ఫుడ్ డెలివ‌రీ యాప్‌లు భారీగా లాభాలు ఆర్జించాయి. స‌రికొత్త రికార్డుసు సృష్టించాయి. దేశంలో ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్‌లైన స్విగ్గి, జోమాటోలు స‌రికొత్త రికార్డుల‌ను సొంతం చేసుకున్నాయి. డిసెంబ‌ర్ 31న స్విగ్గిలో ప్ర‌తి నిమిషానికి 9వేల ఆర్డ‌ర్లు బుక్ చేయ‌గా, జొమాటోలో నిమిషానికి 8వేల ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు పేర్కొన్న‌ది. గ‌తేడాది డిసెంబ‌ర్ 31న స్విగ్గిలో నిమిషానికి 5,500 ఆర్డ‌ర్లు రాగా, ఆ రికార్డు స్విగ్గి ఈ ఏడాది బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు, యాప్‌లో ఎక్కువ ఏ ఐటెమ్‌ బుక్ చేసుకున్నార‌నేది కూడా స్విగ్గి బ‌య‌ట‌పెట్టింది. స్విగ్గియాప్‌లో ఎక్కువ మంది ఆర్డ‌ర్ చేసిన ఐటెమ్ బిర్యానీనే అని స్విగ్గి తెలియ‌జేసింది. బిర్యానీ నిమిషానికి 1229 ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు స్విగ్గి తెలియ‌జేసింది. డిసెంబ‌ర్ 31 వ తేదీ రాత్రి మొత్తం 2 మిలియ‌న్ ఆర్డ‌ర్లు వ‌చ్చిన‌ట్టు స్విగ్గి తెలియ‌జేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like