నిర‌వ‌ధిక స‌మ్మెకు వెన‌కాడం

సమ్మె విజయవంతం చేసిన కార్మిక సోదరులకు ఉద్యమ వందనాలు- కార్మికుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన జేఏసీ నేత‌లు

మంచిర్యాల – సింగ‌రేణి బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో నిర‌వ‌ధిక స‌మ్మెకు కూడా వెన‌క‌డామ‌ని జేఏసీ నేత‌లు స్ప‌ష్టం చేశారు. మూడు రోజుల స‌మ్మె విజ‌య‌వంతం చేసిన కార్మికుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లో సోమ‌వారం ఉద‌యం గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా బెల్లంపల్లి ఏరియా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఉపాధ్య‌క్షుడు మల్రాజు శ్రీనివాస రావు మాట్లాడుతూ మూడు రోజుల స‌మ్మె సమ్మె చారిత్రాత్మక మన్నారు. మరొకసారి సింగరేణి కార్మికులు తమ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడరని స‌మ్మెతో తేలిపోయింద‌న్నారు. సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికునికి పేరుపేరునా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నామ‌న్నారు. సమ్మె ఫలితంగా సింగరేణి యాజమాన్యం 15న యూనియన్ నాయకులను ఢిల్లీ తీసుకువెళ్తోంద‌న్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, బొగ్గు శాఖ కార్యదర్శిని కలిసి చర్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి కి ఇవ్వాలని సమావేశంలో యూనియన్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరతార‌న్నారు. లేక‌పోతే రానున్న రోజులలో నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటియుసి నాయకులు దివాకర్, ఐఎన్‌టీయూసీ నాయకులు సంజీవరెడ్డి, టీబీజీకేఎస్ సెంట్రల్ చీఫ్ ఆర్గనైజిగ్గ్ సెక్రటరీ సంగెం ప్రకాశ్ రావు, కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్,ఖైరిగూడ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింగ రావు, జీఎం కమిటీ మెంబర్ గజేల్లి చంద్రశేఖర్,ఫిట్ కార్యదర్శి కర్ణాతం వెంకటేష్,కుదిరే మొగిలయ్య,శరత్ బాబు,సంపతి తిరుపతి,బొంగు వెంకటేష్,కొండు శంకర్,రామ్మోహన్,ఓరం కిరణ్,రమేష్,జహీర్,మల్లేష్,సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like