నిరుద్యోగుల‌కు బాల్క ఫౌండేష‌న్ గుడ్‌న్యూస్‌

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం సాధ‌న చేసే నిరుద్యోగుల‌కు బాల్క ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు గుడ్‌న్యూస్ తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం 80 వేల‌కు పైగా ఉద్యోగాల‌కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల కోసం ప్ర‌య‌త్నించే నిరుద్యోగుల‌కు కోచింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌నున్నారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మంద‌మ‌ర్రి, చెన్నూరులో రెండు కోచింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఆ కోచింగ్ సెంట‌ర్ల‌కు వ‌చ్చే వారికి మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని బాల్క ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like