నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..

-సింగరేణిని దివాళా తీస్తున్నారు
-తమ సంఘంలో చేరకపోతే బెదిరింపులకు గురిచేస్తున్నారు
-సింగరేణి ని దోచుకునెందుకే కవిత గౌరవాధ్యక్షురాలు అయ్యింది
- ముఖ్య‌మంత్రిపై ఈటెల రాజేంద‌ర్ ధ్వ‌జం

మంచిర్యాల : సింగరేణి గురించి కానీ.. ఇక్కడి కార్మికుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో ఒక్క‌సారి కూడా మాట్లాడ‌లేద‌ని అలా మాట్లాడినట్టు నిరూపిస్తే ముక్కునేలకు రాస్తా అని హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స‌వాల్ విసిరారు. శ్రీరాంపుర్ ఏరియా ఆర్కే6 గనిపై నిర్వహించిన బిఎమ్మెస్ కార్మిక చైతన్య యాత్రను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక్క‌డి కార్మికుల‌పై, సింగ‌రేణిపై కేసీఆర్‌కు ఏ మాత్రం ప్రేమ లేద‌న్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర వాటా వుంది. 49 శాతం వాటా వున్న కేంద్రం ఏనాడు అయినా జోక్యం చేసుకుందా కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. బొగ్గు ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుతుంటే కార్మికుల సంఖ్య పెరిగాలని.. కానీ కార్మికుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. మా కార్మికులు అవసరం అయితే ఒరిస్సా పోతారు… ఆస్ట్రేలియా పోతారన్న కేసీఆర్ కార్మికులను ఎందుకు తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. నాలుగు కోల్ బ్లాక్స్ సింగరేణికి కాకుండ ప్రైవేట్ కు అప్పగించే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. వాటిని సింగరేణి తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల టర్నోవర్ ఉన్న సింగరేణి సంస్థ జీతభత్యాల కోసం బ్యాంకుల వద్ద అప్పులు తీసుకునే పరిస్థితికి కేసీఆర్ దిగదార్చారని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ, సింగరేణి లో కార్మికుల చైతన్యాన్ని కేసీఆర్ చంపేశాడని అన్నారు.కార్మికులు, నాయకులు టీబిజీకేఎస్ లో తప్ప వేరే సంఘంలో చేరితే దూరంగా ట్రాన్స్ ఫర్ చేస్తూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల వేల కోట్ల రూపాయల డబ్బు ను ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం కేసీఆర్ ఖర్చు పెడుతున్నాడని అన్నారు. కల్వకుంట్ల కవిత కు సింగరేణికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సింగరేణిని దోచుకోడానికే కవిత టీబీజీకేస్ గౌరవఅధ్యక్షురాలు అయిందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చాడని అన్నారు. సింగరేణి కార్మికుల కల అయిన ఇన్కంటాక్స్ రద్దు ఒక్క బీజేపీ, బిఎంఎస్ తోనే సాధ్యమన్నారు. ఆ దిశగా మేము అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో బీఎంఎస్ జాతీయ ఇంచార్జి లక్ష్మారెడ్డి,ఏబీకేఎంఎస్ కేంద్ర కార్యదర్శి,జేబీసీసీఐ సభ్యలు మాధవనాయక్, కేంద్ర కార్యవర్గ సభ్యులు పులి రాజారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేష్, భూపాలపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు అప్పని శ్రీనివాస్,బ్రాంచి కార్యాదర్శి సుజెందర్,శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు మారుతి ప్రధాన కార్యదర్శి నాతాడి శ్రీధర్ రెడ్డి,స్టేట్ కార్యదర్శి కాశెట్టినాగేశ్వర్ రావు,భీమయ్య,చంద్రశేఖర్,అల్లం శ్రీనివాస్,చందా మొగిలి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like