సీఎం సిద్ద‌రామ‌య్య కాదు…

-యూట‌ర్న్ తీసుకున్న పార్టీ అధిష్టానం
-ఇంకా 48 గంటల సమయం పట్టొచ్చు

Congress: క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింద‌ని వార్త‌లు.. సిద్ధ‌రామ‌య్య అనుచ‌రుల సంబురాలు.. స్వీట్లు పంచుకుని, బాణాసంచా సైతం కాల్చారు. ఆయ‌న రేపు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేస్తార‌నే వార్త‌లు సైతం గుప్పుమ‌న్నాయి. అయితే, అధిష్టానం ఒక్క‌సారిగా బాంబు పేల్చింది.

కర్ణాటక సీఎం సిద్దరామయ్య అంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొట్టిపారేసింది. ఆయ‌న అభ్య‌ర్థిత్వంపై పార్టీ అధిష్టానం యూటర్న్ తీసుకుంది. సీఎం ఎవరు అనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని.. ఫైనల్ కాలేదని.. దానికి ఇంకా 48 గంటల సమయం పట్టొచ్చని కాంగ్రెస్ కర్నాటక ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ప్రకటించారు. కొత్త కర్ణాటక ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చర్చలు జరుపుతూనే ఉంది. CLP నాయకుడిని, ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి CLP ఖర్గేజీకి ఏకగ్రీవంగా అధికారం ఇచ్చింది తగిన చర్చల తర్వాత ఆయన అదే చేస్తారు” అని సుర్జేవాలా చెప్పారు. సీఎం పేరు ఇంకా ఖరారు కాలేదని ఆయన పునరుద్ఘాటించారు.

బుధవారం ఉదయం జాతీయ మీడియా ముఖ్య‌మంత్రిగా సిద్ద‌రామ‌య్య పేరు ఖ‌రారైన వార్త‌లు ప్ర‌సారం చేసింది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని.. మే 18వ తేదీన బెంగళూరులో సీఎల్పీ భేటీ ఉంటుందని కంఠీర‌వ‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అనే వార్తలు వచ్చాయి. సిద్ధరామయ్య మద్దతు దారులు, కాంగ్రెస్ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని బాణాసంచా కాల్చారు. సిద్ధరామయ్య ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సెక్యూరిటీ పెంచారు. ఈ పరిణామాలు అన్నీ కూడా సిద్ధరామయ్య సీఎం అని డిసైడ్ చేశాయి. ఈ వార్తలు వచ్చిన మూడు గంటల తర్వాత తీరిగ్గా స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రతినిధి సూర్జేవాలా. కర్ణాటక సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదంటూ కామెంట్ చేశారు. దీంతో క‌ర్ణాట‌క క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఆ పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది. పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఖర్గేతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ చీఫ్‌తో చాలా సేపు ర‌హ‌స్యంగా చ‌ర్చించారు. దీంతో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి పేరు ఎప్పుడు ప్ర‌క‌టిస్తార‌నే విష‌యంలో ఉత్కంఠ నెల‌కొంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like