నోటి దూల నీది… నీ భారం భూమిది..

తన భర్త గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్‏కు సింగర్ సునీత కౌంట‌ర్‌

సింగర్ సునీత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‏గానూ సునీత చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల కాలంలో సునీత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటున్నారో తెలిసిందే.

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ.. నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తన గురించి గానీ.. తన కుటుంబసభ్యుల పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ కామెంట్స్ శ్రుతిమించితే వారికి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటరిస్తుంది. తాజాగా తన భర్త రామ్ వీరపనేని గురించి ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సునీత.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహం వద్ద సునీత తన భర్తతో కలిసి వెళ్లారు. సాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక వీరి ఫోటోపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందించారు. అందులో ఓ నెటిజన్ సునీత భర్తపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.

కాకి ముక్కుకు దొండపండు.
సునీతకు ముసలిరామ్ మొగుడు..
అందం ఆమె సొంతం..
ధనం ఆయన సొంతం..
గానం ఈవిడది..
దర్జా అతనిది.. అంటూ ఇష్టానుసారంగా వాగేశాడు.

ఈ కామెంట్ చూసిన సునీత అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. నోటి దూల నీది.. నీ భారం భూమిది అంటూ కౌంటర్ వేశారు. సింగర్ సునీత ఇచ్చిన రిప్లైకు నెటిజన్స్ మద్దతు తెలుపుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like