సమయం ముగిసింది… పరీక్ష చేజారింది..

Officials who do not allow group 1 exam even if it is one minute late: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ప‌రీక్ష‌లు ప్రశాతంగా కొనసాగుతున్నాయి. ఆ పరీక్షల‌కు మంచిర్యాల జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించేది అధికారులు స్ప‌ష్టం చేశారు. ప‌రీక్ష‌కు ఆల‌స్యంగా వ‌చ్చిన చాలా మందిని తిరిగి వెన‌క్కి పంపించారు. జిల్లాలోని బెల్లంప‌ల్లి ప‌ట్టణంలో ఐదుగురు ఆల‌స్యంగా రావ‌డంతో వారిని ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌లేదు. బెల్లంపల్లి పట్టణంలో బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఐదుగురు అభ్యర్థులు లేటుగా హాజర‌య్యారు. దీంతో వారిని వెన‌క్కి పంపించ‌డంతో వారు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like