ఒక అమ్మాయి.. మూడు నెలలు.. ఏడు పెళ్లిళ్లు..

డ‌బ్బులు సంపాందించేందుకు అడ్డ‌దారులు తొక్కుతున్నారు.. చాలా మంది. అలాంటి ఓ ముఠా సినీ ఫక్కీలో మోసం చేసి డబ్బుతో మాయమవుతోంది. ఆ ముఠా మోసం చేయడానికి ఎంచుకున్న మార్గం పెళ్లి. యువకులకు గాలం వేసి.. పెళ్లి చేసుకోవడం.. ఫస్ట్ నైట్ రోజు మత్తు మందు ఇచ్చి డబ్బు, నగలతో ఉడాయించడం ఈ ముఠా పని. ఇలా ఇప్పటి వరకు ఏడుగురిని మోసం చేశారు. వీరి ప్లానింగ్‌లో భాగంగా ఓ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వారిని టార్గెట్ చేస్తుంది. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుని తర్వాత మొదటి రాత్రే మత్తుమందు ఇచ్చి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో పారిపోయేది.

ఒక వేళ ఫస్ట్‌నైట్ ప్లాన్ ఫెయిల్ అయితే … ఆ యువతి దగ్గర ఇంకో ప్లాన్ ఉండేది. పెళ్లైన తర్వాత వారం రోజులు అత్తారింట్లో ఉంటుంది. తర్వాత తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ బ్లాక్ మెయిల్ చేసి వారి దగ్గర నుంచే డబ్బులు లాక్కుంటుంది. ఇలా ఇప్పటికి ఏడుగురికి టోకరా వేసింది. అయితే బాధితుడైన నాలుగో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది.

హ‌ర్యాణాకు చెందిన ఆ అమ్మాయి మొదటగా ఖేడీ కరమ్ శామ్లి ప్రాంతానికి చెందిన సతీష్‌ను పెళ్లి చేసుకుంది. జనవరి 1న రాజస్థాన్లో రెండో వ్యక్తిని, ఫిబ్రవరి 15న మూడో వ్యక్తిని, ఫిబ్రవరి 21న నాలుగో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రాజేందర్ అనే వ్యక్తితో ఐదో పెళ్లి, కుటానాకు చెందిన గౌరవ్ తో ఆరో పెళ్లి, కర్నాల్కు చెందిన సందీప్‌ ఆరోసారి పెళ్లి చేసుకుంది. చివరగా మార్చి 26న బుద్వాకు చెందిన సుమిత్తో పెళ్లి జరిగింది. అంటే మూడు నెలల్లో ఏడు పెళ్లిళ్లు చేసుకుంది.

రంగంలోకి దిగిన పోలీసులు వీరి మోసాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఓ మ్యారేజ్ ఏజెంట్ భిజేంద్ర సింగ్ సహా ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వాందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి బ్లఫ్ మాస్టర్‌ సినిమా స్టైల్లో మోసం చేశారు. చివరికి జైలే గతి అయింది. దీంతో ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like