ఓకే మాట‌.. ఓకే బాట‌గా ముందుకు సాగారు..

త్రిబుల్ ఐటీ విద్యార్థులకు ఘన సన్మానం

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థి సంఘం నాయ‌కుడితో పాటు విద్యార్థుల‌కు స‌న్మానం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై 7 రోజుల పాటు సుదీర్ఘ ఆందోళనలు చేసి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేసిన విద్యార్థి సంఘ నాయకుడు మాదేస్ సుంకరితో పాటు 30 మంది విద్యార్థులను స‌న్మానించారు. బుధవారం రాత్రి కళాశాల ప్రాంగణంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు వీర నందయ్య. నాగభూషణం.మారుతి మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఇబ్బందుల‌కు గురవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సమస్యలపై ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా ప్రభుత్వo. అధికారులు పట్టించుకోలేద‌న్నారు. దీంతో విసుగు చెందిన విద్యార్థులు సంఘటితంగా ఒకే మాట మీద నిలబడి డిమాండ్లను ప‌రిష్క‌రించుకున్నార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం ఒప్పుకునే లాగా కృషి చేసిన అంద‌రిని అభినందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ సభ్యులు లావణ్య గుండేటి సాయిచరణ్,ప్రశాంత్,రజితరాథోడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like