ఒమిక్రాన్​​పై ఐసీఎంఆర్ గుడ్​న్యూస్

రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్​ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్​).

దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కోవిడ్​ కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ అందర్నీ కలవరపెడుతోంది. ఇప్పటికే 28 దేశాలకు పాకిన ఈ వైరస్​.. మన దేశంలోకి కూడా అడుగుపెట్టేసింది. దీంతో, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్​ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఊరటనిచ్చే విషయం చెప్పింది ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్​). హైదరాబాద్​లోని భారత్ బయోటెక్ తయారు చేసిన ‘కోవాగ్జిన్’ ఒమిక్రాన్​కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని గుడ్​న్యూస్​ చెప్పింది. అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కోవాగ్జిన్​ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపింది.

దీనిపై ఐసీఎంఆర్​ అధికారి మాట్లాడుతూ కోవాగ్జిన్ అనేది వైరియన్-ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. ఇది మొత్తం వైరస్‌ను అంతం చేసేలా కవర్ చేస్తుంది. అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేస్తుందని వివరించారు. కోవాగ్జిన్ కేవలం ఒమిక్రాన్​పైనే కాదు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి ఇతర వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఒమిక్రాన్​పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు​ మరిన్ని నమూనాలను స్వీకరించి పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

మరో​ అధికారి మాట్లాడుతూ కోవాగ్జిన్​ ఒమిక్రాన్​ వేరియంట్​కు వ్యతిరేకంగా మనకు​ రక్షణ కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికే కొన్ని శాంపిల్స్​ స్వీకరించి పరిశోధన చేశాం. మరిన్ని శాంపిల్స్​ స్వీకరించిన తర్వాత, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తాం. ఆ తర్వాతే దీనిపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like