ఒంట‌రిగా ఉంద‌ని వేధించాడు.. చిత‌క్కొట్టింది..

అర్ధ‌రాత్రి యువ‌తి ఒంట‌రిగా ఉంద‌ని .. వేధించేందుకు ప్ర‌య‌త్నించాడు.. అంతే ఆమె అప‌ర‌కాళి అయ్యింది.. యువ‌కున్ని చిత‌క్కొంటింది.. వివ‌రాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ యువకుడు బైకును అడ్డగించి వేధింపులకు గురి చేశాడు. ఆ ఈవ్ టీజర్‌ను యువ‌తి చితకబాదింది. కింద ప‌డేసి క‌ర్ర‌తో కొడుతూ.. ఇలా వేధింపులకు గురి చేస్తోంటే ఆడ‌వాళ్లు బ‌య‌ట ఎలా తిర‌గ‌గ‌లుతార‌ని ప్ర‌శ్నిస్తూ పిచ్చికొట్టుడు కొట్టింది. ఏమి తెలీదురా నీకు.. ఏమి తెలీదురా నీకు..? అంటూ ఆమె ప్రశ్నిస్తూ క‌ట్టెతో కొట్ట‌డ‌మే కాకుండా, కాలితో తంతూ త‌న క‌సి తీర్చుకుంది. ఈ వీడియోను ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, ఆ యువ‌తిని ప్ర‌శంసించారు. “గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా బైక్ ను అడ్డగించి వేధించిన దుండగుడిని కర్రతో చితక్కొట్టిన ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్..” అని వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like