కోడి పందెం రాయుళ్ల అరెస్ట్

కోళ్ల పందాల్లో పాల్గొన్న11 మందిని అరెస్టు చేశామని పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బండారికుంటలో కోళ్ల పందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారన్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న వారితోపాటు 11 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొంతమంది పరారయ్యారన్నారు. 10 పందెం కోళ్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పందెంరాయుళ్ల నుండి 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్వాహకులు, కోళ్ల పందాలు ఆడుతున్న ఫజియొద్దిన్, బట్టల రాజు, మన్నం పవన్ కుమార్, మాధవరపు శివయ్య, రాగిని గోపాల్, మహమ్మద్ గౌస్, మహమ్మద్ షఫీ, పిడుగు సదయ్య, సాయి, ఎస్.కె జుబేర్, మహమ్మద్ యూనిస్ను తీసుకున్నామన్నారు. ఎవరైనా కోళ్ల పందాలు నిర్వహించినా, ఆడిన చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని సిఐ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like