పేప‌ర్ లీక్‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మే

-దానిని కేటీఆర్‌కు ముడిపెట్ట‌డం ఏంటి..?
-పేపర్ లీక్ పైన రేవంత్ రెడ్డి ఆధారాలు చూపెట్టాలి
-దేవాదాయ‌, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

Minister Indrakaran Reddy: పేప‌ర్‌లీక్‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మే అని దేవాదాయ‌, న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంట‌ర్మీడియెట్లో, ప‌ద‌వ త‌ర‌గ‌తిలో ఇలా ఎన్నో ర‌కాలుగా పేప‌ర్ లీక్‌లు జ‌రుగుతావుంటాయ‌ని అన్నారు. దాంట్లో కేటీఆర్ దోషి అన‌డం, సీఎంకు నోటీసు పంపాల‌ని చెబుతున్నార‌ని, ఇలా ఎన్నో ర‌కాలుగా మాట్లాడుతున్నార‌ని అన్నారు. కేటీఆర్ ద‌గ్గ‌ర పీఏగా ప‌నిచేస్తున్న తిరుప‌తి అనే వ్య‌క్తి గ్రామంలో 100 మందికి 100కు పైగా మార్కులు వ‌చ్చాయ‌ని రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. దానికి సంబంధించి ఆయ‌న వ‌ద్ద ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టాల‌ని డిమాండ్ చేశారు.

ఈ విష‌యంలో సిట్ ద‌ర్యాప్తు చేస్తున్న విష‌యాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఆ వంద మందికి నోటీసులు జారీ చేసింద‌ని అన్నారు. రేవంత్‌రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కవితను మహిళ అని చూడకుండా ఈడీ వేధింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని పైన ఎదురు దాడి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంపై కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తోంద‌ని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఒక్కరి పైన కూడా ఈడి, సిబిఐ, విచారణ జరగలేదన్నారు. కేవలం బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులపైననే ఈడీ, సిబిఐ వేధింపులు జరుగుతున్నాయన్నారు.

నిర్మల్ నియోజకవర్గంలో 23 నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను చేపడుతున్న‌ట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో బీఆర్ఎస్‌ పార్టీ మెజారిటీతో గెలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షం దాటికి రైతులకు తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే నష్ట పరిహారం అంచనా వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like