పార్టీని బ‌లోపేతం చేద్దాం

బీజేపీ రాష్ట్ర మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గీతామూర్తి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని బీజేపీ రాష్ట్ర మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు గీతామూర్తి కోరారు. మంచిర్యాల ప‌ట్ట‌ణంలో జిల్లా మ‌హిళా మోర్చా కార్య‌వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రజా సమస్యల పై పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నార‌ని అన్నారు. అంతేకాకుండా భార‌తీయ జ‌న‌తా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వారి అడుగుజాడల్లో అందరం స‌మ‌ష్టిగా పని చేసి పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాల‌న్నారు.బీజేపీ పార్టీ అభివృద్ధి ల‌క్ష్యంగా ముందుకు వెళ్లాల‌ని కోరారు. బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ఎర‌వెల్లి రఘునాథ్ మాట్లాడుతూ జిల్లాలో మహిళల సమస్యల పరిష్కారానికి అందరు కలిసికట్టుగా పని చేయాలన్నారు. మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి,సోమారపు లావణ్య,ఉమ మహేశ్వరి,గుర్రాల లావణ్య,బోయిని లలిత, పచ్చ స్వప్నరాణి,గోమాస కమల,వాణి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like