పేద‌ల ఇండ్ల కూల్చివేత అన్యాయం

మంచిర్యాల : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కిష్టంపేట‌, బావురావుపేట గ్రామాల్లోని కొంద‌రు పేద‌ల ఇండ్ల‌ను కూల్చివేయ‌డం అన్యాయ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత న‌ల్లాల ఓదెలు స్ప‌ష్టం చేశారు. ఆయ‌న కూల్చిన ఇండ్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అక్ర‌మంగా క‌ట్టుకున్న ఇండ్ల‌ను కూల్చివేశామ‌ని అధికారులు చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు. వారిలో చాలా మందికి ఇండ్ల‌ను నంబ‌ర్లు సైతం కేటాయించార‌ని, రైతుబంధు సైతం వ‌స్తోంద‌ని అన్నారు. ఇవ‌న్నీ ఉన్న‌ప్ప‌టికీ అన్యాయంగా, అక్ర‌మంగా కూలగొట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఆ భూముల‌కు సంబంధించి ఒరిజిన్ ప‌త్రాలు ఇస్తే వాటిని కాల‌బెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు. జీవో 58,59 ప్ర‌కారం ఎన్నో ఏండ్లుగా నివాసం ఉన్న‌వారికి ఇక్క‌డ ప‌ట్టాలు ఇవ్వాల్సింది పోయి, ఉన్న వాటిని కూల‌గొట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి లేని వారికి భూమి, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తామ‌ని ఆలోచిస్తున్నార‌ని.. మ‌రి ఆయ‌న ఎమ్మెల్యేలు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పీసీసీ స‌భ్యుడు, మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జి నూక‌ల రమేష్ మాట్లాడుతూ వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయ‌కుండా ఎలా కూల్చివేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇష్టానుసారంగా పోలీసుల అండతో ప్ర‌జ‌ల‌పైకి దండెత్తార‌ని అన్నారు. ఇక్క‌డ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ మంద‌మ‌ర్రిలో అక్ర‌మంగా వెంచ‌ర్లు నిర్మిస్తుంటే వాటి జోలికి ఎందుకు వెళ్ల‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో ఇసుక మాఫియా పెద్ద జ‌రుగుతున్నా ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బాధితుల‌కు ఇండ్లు క‌ట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు దారుణ‌మ‌ని, కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో వారితో పాటు చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీ రఘునాథ్‌ రెడ్డి, చెన్నూరు టౌన్ ఇన్‌చార్జి శ్రీధర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజమల్ల గౌడ్, ఓ.శ్రీనివాస్,బాపగౌడ్,బ్లాక్ ఇంచార్జ్ అంక గౌడ్,మునిసిపల్ ప్రెసిడెంట్ పల్లె రాజు,డీసీసీ స‌భ్యులు పుల్లూరి లక్ష్మన్,రేకుల శ్రీనివాస్ రెడ్డి, సుఖేందర్, కలిల్, గంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,సురేష్,రాజేందర్,మెడ రోహన్ రెడ్డి,రాజేష్ గజ్జెల,తెప్పల శేఖర్, ఎల్లయ్య పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like