పెద్ద నేత.. పచ్చి బూతులు..

మంచిర్యాల – పెద్ద‌ప‌ల్లి ఎంపీ వెంక‌టేష్ నేత ఫోన్ ఓ వ్య‌క్తిపై బూతు పురాణం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తిరుప‌తి అనే వ్య‌క్తిపై ఎంపీ బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. త‌న గురించి చెబుతూ ప‌చ్చి బూతులు తిట్టారు. నేత‌కాని కుల సంఘం స‌మావేశంలో  ఎంపీ వెంక‌టేష్ నేత‌ను ల‌క్ష్సెట్టిపేట మండ‌లం తిమ్మాపూర్‌కు చెందిన వ్య‌క్తి విమ‌ర్శించిన‌ట్లు తెలుస్తోంది. వెంక‌టేష్ నేత‌కు తిరుప‌తి ఫోన్ చేయ‌డంతో బూతులు అందుకున్నారు.  త‌న విశ్వ‌రూపం చూపించాల్సి ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. … ప‌గ‌ల‌గొడ‌తా, వెంక‌టేష్ నేత అంటే ఏమ‌నుకుంటున్న‌వ్‌.. నా విశ్వ‌రూపం చూస్త‌వా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాకు ఇంకోసారి ఫోన్ చేసినా నా ద‌గ్గ‌రికి వ‌చ్చినా కాళ్లు విర‌గ్గొడ‌తా అంటూ సీరియ‌స్ అయ్యారు. ఇప్ప‌టికైనా ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ఉండు… అని ఎంపీ తిట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like