పేదింటి బిడ్డ వివాహానికి చేయూత

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం లోని ఘన్ పూర్ గ్రామానికి చెందిన ఓ పేద యువ‌తి వివాహానికి జిల్లా మున్నూరు కాపు యువ‌త అండ‌గా నిల‌బ‌డింది. జిల్లాలో మున్నూరు కాపు సంఘం స‌భ్యులు, ఇత‌ర మిత్రుల సాయంతో దాదాపు రూ. 45,000 జ‌మ చేశారు. ఈ మేర‌కు ఆదివారం ఆ యువ‌తి కుమారి దెబ్బటి జాన్సీ, ఆమె కుటుంబ‌స‌భ్యులు ఆ మొత్తం అంద‌చేశారు. జిల్లా మున్నూరుకాపు యువత అధ్యక్షులు ఆకుల సూరి పటేల్, జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో డ‌బ్బులు జ‌మ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మాజీ ఎంపీపీ మసాడి శ్రీరాములు, గాజుల గోపాలకృష్ణ, మున్నూరు కాపు సంఘం యూత్ అధ్య‌క్షులు అంబీర్ మహేందర్, అంగలి వెంకటస్వామి, గంధం మల్లేష్, ఆకుల రాజు, సుంకరి కిరణ్, అంగలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. తాము పెట్టిన మేసేజ్‌తో డ‌బ్బులు అంద‌చేసిన ప్ర‌తి ఒక్క‌రికి పేరుపేరునా జిల్లా మున్నూరుకాపు యువత అధ్యక్షులు ఆకుల సూరి పటేల్, జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీకాంత్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like