పెన్సిల్ పంచాయితీ.. ఆ వీడియో ఎప్ప‌టిదంటే…

నా పెన్సిల్ పోయింది.. వీడి మీద కేసు పెట్టండి సార్ అని వీడియో వైర‌ల్ అవుతోంది.. వేలాది మంది దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు తెలంగాణ‌, ఆంధ్రాలో హాట్టాపిక్ గా మారటమే కాదు.. వీడియో చూసినోళ్లంతా పిల్లల పంచాయితీకి తెగ నవ్వేసుకుంటున్నారు. నిజానికి ఈ వీడియో ఆర్నెల్ల కింద‌టిది. దీన్ని స్నేహితులకు సరదాగా ఫార్వడ్ చేయటం.. ఈ వీడియో చక్కర్లు తిరుగుతూ.. తిరుగుతూ ఇప్పుడు మీడియాలోనూ ఆసక్తికర వార్తగా మారింది.

కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన విద్యార్థి ఒకడు ఒక ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. ఇంటి పక్కనే ఉన్న స్నేహితుడు రోజూ తన పెన్సిల్ తీసేసుకుంటుండటంతో విసిగిపోయాడు. స్నేహితుల్ని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్ వెళ్లాడు. తన వెంట.. పెన్సిల్ చోరీ చేస్తున్న మిత్రుడ్ని తీసుకెళ్లాడు. తనకు న్యాయం చేయాలని పంచాయితీ పెట్టాడు.‘ఆడి మీద కేసు పెట్టాలె’ అంటూ పిల్లాడి ముఖం సీరియస్గా చెప్పేయటం చూసి… అక్కడున్న పోలీసులు.. ఈ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేసి.. ఆగ్రహంతో వచ్చిన పిల్లాడు హనుమంతుని సముదాయించారు.

‘‘హనుమంతు పెద్ద మనసు చేసుకో. కేసు పెడితే జైలుకు పంపాల. బెయిల్ తెచ్చుకోవటం.. తల్లిదండ్రలను పోలీసు స్టేషన్ తీసుకురావాల్సి ఉంటుంది. అవన్నీ కష్టం కదా హనుమంతు.. కాస్త పెద్ద మనసు చేసుకో. ఈ సారికి క్షమించు’’ అంటూ అక్కడి కానిస్టేబుల్ అనునయంగా చెప్పి.. వారిద్దరి మధ్య రాజీ కుదిర్చి.. చేతిలో చేయి వేయించి.. స్నేహితులుగా ఉండాలని చెప్పి పంపారు. బాగా చదువుకోవాలన్న పోలీసు మాటకు అన్యమనస్కంగా హనుమంతు ఒప్పుకున్నాడు.

స్నేహితుడి చేతిలో చేయి వేశాడు. మొత్తంగా పోలీస్ స్టేషన్ లో పిల్లల పెన్సిల్ పంచాయితీ వీడియో నవ్వులు పూయిస్తోంది.

చిన్నారుల పెన్సిల్ పంచాయతీ కింది లింక్ ఓపెన్ చేసి చూడండి.

https://www.facebook.com/NewsAPTS/videos/668532800799641

Get real time updates directly on you device, subscribe now.

You might also like