బ‌డుగుల‌పై పిడుగు

-రెండు జిల్లాల్లో నలుగురు మృత్యువాత‌
-నాలుగు రోజుల్లో ఆరుగురి బ‌లి

పిడుగుపాటు కారణంగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో న‌లుగురు మృత్యువాత ప‌డ్డారు. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఒకరు చనిపోయారు. రెండు రోజుల కింద‌ట కొమురంభీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో పిడుగుపాటుతో త‌ల్లి, కొడుకు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

కొమురంభీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని వైగాంకి చెందిన సద్గరే రేఖ బాయి (41) గ్రామశివారులో పత్తి విత్తనాలు పెట్టేందుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగుపడి మరణించింది. కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సాదులసుమన్ (27), అంకుషాపూర్ చెందిన సెండె నానయ్య(33) అనే రైతులు ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ తమ పొలాల్లో విత్తులు విత్తుతుండగా పిడుగుపాటుకు గురయ్యారు. సుమన్ వెంట ఉన్న అతని భార్య, మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా కోట‌ప‌ల్లి మండలంలోని సర్వాయిపేటకి చెందిన దుర్గం అంకమ్మ (55) పిడుగుపాటుతో మృతి చెందింది. అంకమ్మ తోటి కూలీలతో కలిసి కొండంపేట గ్రామశివారులో చేనులో పత్తి విత్తనాలు నాటేందుకు వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగుపడగా అంకమ్మ అక్కడికక్కడే మరణించింది. ద‌హెగాం మండ‌లంలో పిడుగుపడడంతో ఇట్యాలకి చెందిన దుర్గం శంకర్, బోర్లకుంట గ్రామానికి చెందిన గోండ్ర ఒత్తుకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like