విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌

Durgam Chinnaiah: బీజేపీ, ఆ పార్టీ అధ్య‌క్షుడు బండిసంజ‌య్ విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద బండిసంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పథకం ప్రకారం రాష్ట్రంలో పరీక్షపత్రాలు లీక్ చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. బీఆర్ఎస్ చేస్తున్న ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌తిప‌క్షాల‌కు ఏం చేయాలో అర్ధం కావ‌డం లేద‌న్నారు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.ఎవ‌రెన్ని కుట్ర‌లు ప‌న్నినా ప్ర‌జ‌లు బీఆర్ఎస్ వైపు ఉన్నార‌ని దుర్గంచిన్న‌య్య స్ప‌ష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, ఎంపీపీ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు సురేష్,అస్మా, నీలికృష్ణ,గడ్డం అశోక్, మటూరిమధు, గోసికరమేష్, రాములునాయక్, ఏలురి వెంకటేష్, వాజిద్‌, ప‌ట్ట‌ణ BRS అధ్య‌క్షుడు బొడ్డు నారాయణ, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ రేవెల్లి విజయ్, పట్టణ అధికార ప్రతినిధి కాసర్లయాదగిరి,మహిళా అధ్యక్షురాలు సత్యవతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like