పొదుపు భ‌విష్య‌త్‌కు మ‌దుపు

స‌బ్ డివిజిన‌ల్ పోస్ట‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ రామారావు

మ‌నం చేసుకునే చిన్న పొదుపే రేప‌టి భ‌విష్య‌త్తుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని బెల్లంప‌ల్లి స‌బ్ డివిజిన‌ల్ పోస్ట‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్ రామారావు అన్నారు. మాదారం, నీలాయ‌ప‌ల్లి, న‌ర్సాపూర్‌, మాదారం3 ఇంక్లైన్ ప్ర‌జ‌ల‌తో మాదారం టౌన్షిప్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఆవ‌ర‌ణలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌లంద‌రూ పొదుపై దృష్టి సారించాల‌ని అన్నారు. ప్ర‌జ‌లు పెన్ష‌న్‌, ఎన్ఆర్ఈజీఎస్ ప‌థ‌కాలకు సంబంధించి డ‌బ్బులు తీసుకునేందుకు వ‌స్తార‌ని వాటిల్లో కొంత మేర‌కైనా పొదుపు చేసుకోవాల‌ని కోరారు. అలా పొదుపు చేసుకున్న సొమ్ము అవ‌స‌రానికి ఉప‌యోగ‌ప‌డ‌తుందని అన్నారు. ప్రతి ఇంటిలో ఒక్కరికైనా గ్రామీణ తపాలా బీమా చేసుకోవాలని సూచించారు. కొత్త‌గా ఖాతాలు ప్రారంభించిన‌ 16 మందికి పాస్ పుస్తకాలు అందించారు. అంతేకాకుండా, 30మంది దగ్గర కొత్త ద‌ర‌ఖాస్తులు తీసుకొని వారందరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని మాదారం టౌన్షిప్ పోస్ట్ మాస్టర్ ని ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like