మావోయిస్టుల కట్టడికి వ్యూహరచన

-మంచిర్యాల జిల్లా జైపూర్ లో రెండు రాష్ట్రాల పోలీసుల సమావేశం
-30 మంది ఐపీఎస్, నిఘా విభాగం అధికారులు హాజరు

Mancheriyal: మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది ఐపీఎస్లు, నిఘా విభాగాల పోలీస్ అధికారులు ఒక రహస్య సమావేశం.. మావోయిస్టుల కట్టడికి తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ లో రెండు రాష్ట్రాల పోలీసులు సమావేశం అయ్యి పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. భద్రత, ఇతర కారణాల దృష్ట్యా సమావేశం రహస్యంగా ఉంచారు.

మావోయిస్టుల కట్టడి కోసం ఉమ్మడి రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు మొదటి సారి సమావేశం అయ్యారు. తునికాకు సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ వైపు కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్ట్ లకు డబ్బులు వెళ్లకుండా కట్టడి చేసేందుకు వ్యూహం సిద్దం చేసినట్లు సమచారం. ఇక మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎన్కౌంటర్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దాని పై సైతం సుధీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోలు అడుగుపెట్టకుండా తీసుకునే చర్యల పై ఉమ్మడి రాష్ట్ర అధికారులు వ్యూహం రూపొందించినట్లు సమచారం.

మరో వైపు ప్రాణహిత నది ప్రవాహం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మావోయిస్టుల అణిచివేత కోసం రూపొందించిన బ్లూ ప్రింట్ మీద చర్చ కొనసాగుతోంది. తెలంగాణలో కొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యం లో మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. కాబట్టి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సైతం పోలీసులు వ్యూహరచన రూపొందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like