పదవీ బాధ్య‌త‌లు స్వీకరించిన పొంగులేటి

Ponguleti Srinivasa Reddy:రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలునాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీరెడ్డితోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె.అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీలు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీలు మధు సూధన్, హాష్మి, రాజారెడ్డి, సీఐఈ రాధా కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.

భువనగిరిలో స్పోర్ట్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమి
భువనగిరి జిల్లా రాయగిరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమి కేటాయిస్తూ మొదటి ఫైల్‌పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. రూ. 9.50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖ కు కేటాయించారు.

33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన కెమెరాలు
రాష్ట్రంలోని 33 జిల్లాల డీపిఆర్ఓలకు అధునాతన కెమెరాలు అందచేసే సమాచార, పౌర సంబంధాల శాఖకు చెందిన ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్లపై సంతకం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like