ఆ రోజు ప్ర‌యాణాలు వాయిదా వేసుకోండి

ప్ర‌జ‌లకు మంత్రి కేటీఆర్ విజ్ఞ‌ప్తి

వ‌రంగ‌ల్ త‌మ‌కు క‌లిసివ‌చ్చిన ప‌ట్ట‌ణ‌మ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం మాట్లాడారు. ద్విదశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లకు సన్నహక సమావేశాలు జరుగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. టీఆర్ ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ కు మద్దతు ఇస్తూ 10 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16వేల 3వందల 95వరకు కమిటీలు ఏర్పాటు అవుతున్నాయ‌ని చెప్పారు. నవంబర్ 15న ఆర్టీసీ బస్సులు టీఆరెస్ పార్టీ తీసుకుంటుంద‌ని, ప్ర‌జ‌లు ఆ రోజు ప్రయాణాలు పెట్టుకోకుండా మాకు సహకరించాల‌ని కోరారు. 7వేల ఆర్టీసీ బస్సులు వరంగల్ సభకు వాడుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కోవిడ్ అనేది ఇక లేనట్టే అనుకోవాలన్నారు. రాబోయే నెల రోజుల్లో దాదాపు వ్యాక్సినేషన్ తెలంగాణ లో పూర్తి అవుతుందని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like