ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల మ‌ధ్య వార‌ధులు మీరే

-విప‌క్షాల అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు తిప్పికొట్టండి
-జిల్లావ్యాప్తంగా సోష‌ల్‌మీడియా క‌మిటీలు
-క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు గుర్తింపు ఉంటుంది
-ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్

మంచిర్యాల : ప‌్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్య‌త మీదేన‌ని మీరు ప్ర‌భుత్వ వార‌ధుల‌ని ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. బుధ‌వారం వేంప‌ల్లిలో నిర్వ‌హించిన మంచిర్యాల నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ అవగాహన సదస్సులో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అదే స‌మ‌యంలో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల‌న్నారు. రానున్న రోజుల్లో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బూత్ లెవల్ నుంచి జిల్లా స్థాయి వరకు సోషల్ మీడియా కమిటీలు వేస్తామన్నారు. సోషల్ మీడియాలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించి రానున్న రోజుల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా హెచ్చ‌రించారు. సామాజిక మాధ్యమాలలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ లెక్కలతో గట్టిగా సమాధానం చెప్పాల‌ని పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like