ప్రైవేటీకరణపై TBGKS పోరు

సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా TBGKS పోరుబాట పట్టింది. మందమర్రి ఏరియాలో కాసిపేట2, శాంతిఖని గనులలో ఎస్.డి.ఎల్.ను ప్రైవేటుపరం చేయడంతో పాటు, చాలా చోట్ల ప్రైవేటీకరణ చేస్తున్నారు. సింగరేణి సంస్థ తీసుకున్న ఈ సింగరేణి కార్మిక వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని TBGKS నిర్ణయం తీసుకుంది.

ముందుగా అన్నిగనులు డిపార్టుమెంట్లపై
8వ తేదీ నల్లబాడ్జీలు ధరించి మెమోరాండం సమర్పించనున్నారు. 12వ తేదీ అన్ని జి.ఎం.ఆఫీసు ల ముట్టడితో భారీ ఎత్తున అన్ని ఏరియాలలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారు. 18వ తేదీ కొత్తగూడెం కార్పొరేట్ లో అన్ని ఏరియాలనుండి తరలివెళ్లి మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like