ప్ర‌స‌వానికి న‌ర‌క‌యాతన‌..

అమ్మ‌కు ప్ర‌స‌వం కోసం యాత‌న‌లు త‌ప్ప‌డం లేదు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో గ్రామాల‌కు ర‌వాణా సౌక‌ర్యాలు నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో అంబులెన్స్‌లు గ్రామాల్లోకి వెళ్ల‌డం లేదు. దీంతో గ‌ర్భిణీల‌కు ప్ర‌స‌వానికి నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంది.

కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన గర్భిణి ప్ర‌స‌వానికి ఆసుప్ర‌తికి వెళ్లేందుకు నానా యాత‌న ప‌డాల్సి వ‌చ్చింది. ఊరికి సరైన దారి లేకపోవడంతో పురుటి నొప్పు లతో బాధపడుతున్న ఓ గర్భిణిని సుమారు మూడు కిలోమీటర్లు డోలీపై మోసుకెళ్లిన ఘటన జ‌రిగింది. కుమురం భీం జిల్లా లింగాపూర్ మండల పరిధిలో లేండిగూడ గ్రామానికి చెందిన గర్భిణి పర్చకి రాధాబాయికి పురుటినొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఏఎన్ఎం అవ్వాల్ అంబులెన్స్కు సమాచారం అందించారు. ఆ ఊరిలోకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్థులు డోలీపై సుమారు మూడు కిలోమీటర్లు చోర్పల్లి గ్రామం వరకు మోసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ సిర్పూర్(యు) ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అదే వాహనంలో జైనూర్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా. మార్గమధ్యలో భుర్నూర్ గ్రామ సమీపంలో అంబులెన్స్లోనే పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు జైనూర్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like