ప్ర‌భుత్వ విధానాల‌తోనే నిరుద్యోగుల ఆత్మ‌హ‌త్య‌లు

మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావు ఆగ్ర‌హం - బాధిత కుటుంబానికి రూ. ల‌క్ష ఆర్థిక సాయం - అండ‌గా ఉంటామ‌ని హామీ

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాలకు నోటిఫికేష‌న్లు వేయ‌కుండా కాలాయాప‌న చేస్తుండ‌టంతో నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్నఆసంపెల్లి మ‌హేష్ కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మం జ‌రిగిందే నీళ్లు, నిధులు, నియామ‌కాల కోస‌మ‌న్నారు. ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో విఫ‌ల‌మైంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

బాధిత కుటుంబానికి రూ. ల‌క్ష ఆర్థిక సాయం

కోటపల్లి మండలం బబ్బెర చెలుక గ్రామానికి చెందిన అసంపెళ్ళి మహేష్ కుటుంబానికి ఆయ‌న ల‌క్ష రూపాయ‌లు ఆర్థిక సాయం అందించారు. ఆ కుటుంబానికి తాము అండ‌గా ఉంటామ‌ని ఈ సంద‌ర్భంగా ప్రేంసాగ‌ర్‌రావు హామీ ఇచ్చారు. మ‌హేష్ మృతి చెందిన స‌మ‌యంలో సైతం రూ. 30 వేలు అందించారు. కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌తో పాటు ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like