మోదీ కాళ్లు మొక్కిన మ‌రో ప్రధాని

Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు మొక్కారో ప్ర‌ధాన‌మంత్రి. మోదీ ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌నో ఉన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఆయ‌న ప‌పువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకు స్వాగతం పలుకుతూ పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ఆయన కాళ్లకు నమస్కరించారు. దీంతో మోదీ వెంటనే ఆయనను పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐల్యాండ్స్ కార్పొరేషన్ (FIPIC) మూడో సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం ఆ దేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ(Narendra Modi)కి ఆహ్వానం పలుకుతూ ఆయన కాళ్లు మొక్కారు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే (James Marape). ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీనే.

సూర్యాస్తమయం తర్వాత పపువా న్యూ గినియాకు వచ్చిన ఏ నాయకుడికి కూడా అధికారికంగా స్వాగతం పలకకూడదని ఆ దేశంలో నియమం ఉంది, కానీ ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఈ దేశం తన సంప్రదాయానికి స్వ‌స్తి చెప్పింది. కానీ భారతదేశం ప్రాముఖ్యత, ప్రపంచ వేదికపై ప్రధాని మోదీకి పెరుగుతున్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని, అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఏకంగా ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేయడం విశేషం.

పోర్ట్ మోర్స్బీలో ప్రధాని మోదీకు గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ప్రభుత్వం కూడా లాంఛనప్రాయ స్వాగతం పలికింది. వారితో సెల్ఫీలకు పోజులిచ్చి నవ్వుతూ, ఊపుతూ ప్రధాని మోదీ అందరికీ విష్ చేశారు. అయితే తనకు స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీ ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలుపుతూ, “విమానాశ్రయానికి వచ్చి నన్ను స్వాగతించినందుకు ప్రధాని జేమ్స్ మరాపేకి ధన్యవాదాలు. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన స్వాగతం. నా పర్యటన సందర్భంగా ఈ గొప్ప దేశంతో భారతదేశ సంబంధాలను పెంపొందించుకోవాలని ఎదురుచూస్తున్నాన’ని ట్వీట్ చేశారు.

ఇక, ఫోరమ్ ఫర్ ఇండియా- పసిఫిక్ కార్పొరేషన్ (ఎఫ్‌ఐపీఐసీ) సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పపువా న్యూ గినియా వచ్చారు. ఈ సమావేశంలో 14 దేశాల నాయకులు పాల్గొంటారు. పపువా న్యూ గినియాలో పర్యటించిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like