ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియ‌న్ నిక‌త్ జ‌రీనా

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్ నిలిచింది. 52 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్‌లో థాయిలాండ్ బాక్సర్‌పై విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకొని భారత్ తరఫున కొత్త చరిత్ర లిఖించింది. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌ ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సీనియర్‌ స్థాయిలోనూ తొలిసారి టైటిల్ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. రింగ్‌లో సివంగిలా చెలరేగిపోయి అభిమానుల మనసులను గెలుచుకుంది. గురువారం సాయంత్రం జరిగిన తుది పోరులో 52 కేజీల విభాగంలో థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్ జుటామస్‌నుఓడించింది.

ఇప్ప‌టికి ఆరు సార్లు స్వ‌ర్ణం..
మహిళల బాక్సింగ్‌లో భారత్‌ ఇప్పటివరకూ ఆరుసార్లు స్వర్ణ పతకం దక్కించుకుంది. మేరీకోమ్‌, సరితాదేవి, ఆర్‌.ఎల్‌. జెన్నీ, లేఖ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో ఐదో బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ చేరింది.

ఎవరీ నిఖత్ జరీనా..?
నిజామాబాద్లో జమీల్-సుల్తానా దంపతులకు 1996 జూన్ 14న నిఖత్ జరీన్ జన్మించింది. స్థానిక నిర్మల హృదయ బాలికల స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసి.. హైద‌రాబాద్ ఏవీ కాలేజ్లో డిగ్రీ చదివింది. 13 సం. ల వయస్సులోనే బాక్సింగ్ పై మక్కువ పెంచుకోగా.. తండ్రి మద్దతిచ్చి తొలి శిక్షకుడయ్యారు. కెరీర్లో సాధించిన విజయాలతో గతేడాది ఆమె హైద‌రాబాద్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ లో స్టాఫ్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యారు.

ప్ర‌భుత్వ విప్ శుభాకాంక్ష‌లు..
థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో గెలిచిన నిక‌త్ జ‌రీన్‌కు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రపంచ చాంపియన్ గా అవతరించి.. దేశానికి స్వర్ణ పత‌కం అందించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ కు శుభాకాంక్షలు అని ట్విట్ట‌ర్ ద్వారా అభినంద‌నలు తెలిపారు. ముందు ముందు మ‌రిన్ని విజ‌యాలు సాధించి దేశానికి, తెలంగాణ‌కు పేరు తేవాల‌ని ఆకాక్షించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like