గోలేటీ ఓపెన్ కాస్టుపై నేడు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌

Public opinion collection on Goleti open cast today: బెల్లంపల్లి ఏరియా గోలేటి ఓపెన్‌కాస్టు కోసం నేడు (శుక్రవారం) ప్రజాభిప్రాయ సేకరణ నిర్వ‌హించనున్నారు. దీనికి సంబంధించి రెండు జిల్లాల క‌లెక్ట‌ర్లు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌లి ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ నిర్వ‌హిస్తారు. రెబ్బెన మండలం గోలేటి ఎంవీటీసీ వద్ద ప్రజాభిప్రాయసేకరణకు సింగరేణి ఏర్పాట్లు చేసింది. ఓపెన్ కాస్టు ఏర్పాటైతే 15 ఏండ్లు నిరంత‌రాయంగా బొగ్గు ఉత్ప‌త్తి జ‌రుగుతుంది. టా 3.5మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి జ‌రుగుతుంది. గోలేటి-1, 1ఏ ఇంక్లైన్‌‌‌‌, గోలేటి–2, అబ్బాపూర్​ ఓసీపీ, ఖైరీగూడ ఓసీపీ, డోర్లి1, డోర్లి2 ఓసీపీల్లో బొగ్గు ఉత్ప‌త్తి కొన‌సాగేది. కానీ, ప్ర‌స్తుతం గ‌నులు ఒక్కొక్క‌టిగా మూత‌ప‌డుత‌వూ వ‌చ్చాయి. ప్రస్తుతం ఖైరిగూడ, బీపీఏ ఓసీపీ2 గనులు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఖైరీగుడ ఓపెన్‌కాస్టు జీవితకాలం మరో ఏడేళ్లే. ఈ నేప‌థ్యంలో గోలేటీ ఓపెన్‌కాస్టు ద్వారా బొగ్గు ఉత్ప‌త్తి చేయాల‌ని సింగ‌రేణి నిర్ణ‌యం తీసుకుంది. ఈ కార్య‌క్ర‌మం ఎన్విరాన్‌మెంట్ టీఎస్‌పీసీ అధికారి మాన‌స‌, సింగ‌రేణి ఎన్విరాన్‌మెంట్ జీఎం కొండ‌య్య, బెల్లంప‌ల్లి ఏరియా జీఎం దేవేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like