ఐపీసీ చట్టాల్లో మార్పులు

భారతీయ శిక్షాస్మృతిలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మూడు కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్రం ఇండియన్ పీనల్ కోడ్(IPC), కోడ్ ఆప్ క్రిమినల్ ప్రొసీజర్(CRPC)తో పాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులు, చేర్పులు చేపట్టింది. దశాబ్ధాలుగా కొనసాగుతూ వస్తున్న ఇండియన్ క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులు తీసుకువచ్చింది. మొదటిది 1860లో రూపొందించబడిన భారతీయ శిక్షాస్మృతి, రెండవది 1898లో రూపొందించబడిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మూడవది 1872లో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన భారతీయ సాక్ష్యాధారాల చట్టం.. ఈ మూడింటినీ స్థానంలో మూడు కొత్త చట్టాలు వచ్చాయి.

పై మూడు పాత చట్టాల‌ స్థానంలో భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య కొత్త చట్టాల్ని తీసుకువచ్చారు. ఇక నుంచి ఈ చట్టాలే అమలులోకి వస్తాయని పార్లమెంటు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ బిల్లులు వెంట‌నే ఆమోదం పొందాయి. భారతీయ శిక్షాస్మృతిలో చేపట్టిన మార్పుల ఆధారంగా ఇకపై దేశంలో శాంతికి భంగం కలిగించే నేరాలు, సాయుధ తిరుగుబాటులు, విద్వంసకర చర్యలు, విభజనవాద కార్యకలాపాలు, భారత ఐక్య, సమగ్రతకు సంబంధించిన చట్టాలను సవరించి కొత్త చట్టాల్లో చేర్చారు.

అలాగే మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేకే నేరాలను కొత్త బిల్లులో ప్రాధాన్యత కల్పించనున్నారు. చిన్న చిన్న నేరాలకు పాల్పడే వారికి సంఘసేవను శిక్షగా విధించ‌బోతున్నారు. లింగసమాన్యంతో కొత్త చట్టాలను రూపొందించారు. శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మూడు కొత్త బిల్లుల్లో చేపట్టిన మార్పులు ఈ కింది విధంగా ఉన్నాయి. మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించడం. సామూహిక అత్యాచారానికి 20ఏళ్ల జైలుశిక్ష, సామూహిక‌ దాడులకు ఏడేళ్ల జైలు శిక్ష పడనుంది. ఏడేళ్ల జైలుశిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఉండాలని పేర్కొన్నారు. వీటితో పాటు ఎక్కడి నుంచైనా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ నమోదు చేసే విధంగా ఈ ఎఫ్‌ఐఆర్ ప్రవేశపెడుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ చేస్తే వారెంట్‌తో పాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందేనని శిక్షాస్మృతిలో మార్పులు చేపట్టారు. వీటితో పాటు ఎఫ్ఐఆర్‌ నుంచి ఛార్జ్‌షీట్‌ వరకు అన్ని డిజిటైలేజ్ చేయాలని బిల్లుల్లో ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like