రైతు ఉద్యమ ప్రాంతాల్లో బీజేపీకి భారీ లీడ్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య గణాంకాలు వెలువడుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకాగా, ముందస్తు ఫలితాల ట్రెండ్ ప్రకారం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ లీడ్ సాధించగా, పంజాబ్ లో ఆప్ ముందంజలో ఉంది. యూపీలో బీజేపీకి పెద్ద శరాఘాతం అవుతుందనుకున్న రైతుల ఉద్యమ ప్రభావం వాస్తవంలో పెద్దగా లేనట్లు ప్రస్తుతానికి కనిపిస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు జరిగిన రైతుల ఉద్యమంలో పశ్చిమ యూపీ ప్రాంత రైతులు కీలక భూమిక పోశించారు. ఆ ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి తప్పదని భావించినా, ఇవాళ వెలువడుతోన్న ఫలితాలు మరోలా ఉన్నాయి..

యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలుండగా.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. పశ్చిమ యూపీలో బీజేపీ అద్భుత ప్రదర్శన చేస్తోంది. వెస్ట్రన్ యూపీని స్వీప్ చేసే దిశగా బీజేపీకి ఓట్లు వస్తున్నాయి. వెస్ట్రన్ యూపీలో కనీసం 114 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బాబాయి, ములాయం సోదరుడైన శివపాల్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు.

మొత్తంగా యూపీలో 403 స్థానాలకు బీజేపీ ప్రస్తుతం 180కిపైగా స్థానాల్లో లీడ్ సాధించగా, సమాజ్ వాదీ పార్టీ 60 స్థానాల్లోపే లీడ్ ఉంది. బీఎస్పీ 7 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like