రైతులకు ఇబ్బంది జరిగితే ఉపేక్షించేది లేదు

ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్

మంచిర్యాల : ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రైతుల‌కు ఇబ్బంది క‌లిగితే ఉపేక్షించేది లేద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. యాసంగి వడ్ల కొనుగోలుపై జిల్లా రైస్ మిలర్స్ యజమానులతో కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రైస్ మిల్ల‌ర్ల యజమానులు రైతులకు, ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం ఖ‌చ్చితంగా ధాన్యం సేకరించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్ట పోయే అవకాశం ఉందన్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మిల్ల‌ర్లు ధాన్యం కొనుగోలు చేయాల‌న్నారు. రాష్ట్రంలో ఉన్న పాలసీనే మన జిల్లాలో ఉందని తెలిపారు. మిల్లర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌న దృష్టికి మిల్ల‌ర్లు తీసుకువ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను విప్ బాల్క సుమ‌న్ స‌మావేశం నుంచే మంత్రి గంగుల కమలాకర్ గారితో చర్చించారు. అదే స‌మ‌యంలో ప్రభుత్వం లేవనేత్తిన అంశాలపై రైస్ మిల్ల‌ర్ల య‌జ‌మానులు సైతం సానుకూలంగా స్పందించారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ స‌మావేశంలో మంచిర్యాల శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, DCMS ఛైర్మన్ లింగయ్య, కలెక్టర్ భారతి హొళ్లికేరి, అడిషనల్ కలెక్టర్, రైస్ మిలర్స్ అస్సోసియేషన్ సభ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like