రామ్ భాయ్‌… మీ ఛాలెంజ్ స్వీక‌రించా..

తెలంగాణ మంత్రి కేటీఆర్ విసిరిన చాలెంజ్ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వీకరించారు. ‘రామ్‌ భాయ్‌ (కేటీఆర్‌).. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా’ అంటూ చేశారు. ఇంత‌కీ మంత్రి కేటీఆర్ ఏం ఛాలెంజ్ చేశారు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశారు.. అంటే చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేనేత ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించేలా ట్విట‌ర్‌లో ప్ర‌ముఖుల‌ను చాలెంజ్ విసిరారు. చేనేత వ‌స్త్రాలు ధ‌రించిన ఫొటోలు పెట్టాల‌ని కోరారు. అందులో భాగంగా మంత్రి కేటీఆర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఈ ఛాలెంజ్ విసిరారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌తో పాటు పవన్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు, తెలంగాణకు చెందిన భాజపా ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పవన్‌ ‘చేనేత’ సవాల్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలని పవన్‌ వారిని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like