ప్రారంభానికి సిద్ధ‌మైన పోలీస్ క‌మిష‌న‌రేట్‌

-28 ఎక‌రాల స్థ‌లం, 38 కోట్ల 50 లక్షల వ్యయం
-మే 8న రామ‌గుండం క‌మిష‌రేట్ ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్‌, మ‌హ‌మూద్ అలీ
-తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా

Ramagundam Police Commissionerate: కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 8న మంత్రి కేటీఆర్, హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సోమ‌వారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, క‌మిష‌న‌ర్ రెమా రాజేశ్వరి కలిసి కమిషనరేట్ కార్యాలయాన్ని ప‌రిశీలించారు. కమిషనర్ ఛాంబర్, అడిషనల్ డీసీపీల చాంబ‌ర్లు, కాన్ఫరెన్స్ హాల్, గ్రీవెన్స్ సెల్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్స్, మీటింగ్ హాల్ ,రిసెప్షన్ కౌంటర్, సిబ్బంది గ‌దులు ప‌రిశీలించారు.

దామోదర్ గుప్తా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పోలీసు యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ బిల్డింగులు సిద్ధమయ్యయని అన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమ‌య్యింద‌న్నారు. చిన్న చిన్న పనులు ఉంటే త్వరతగతిన పూర్తిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సుదీర్ కేకన్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్, ఏసీపీలు ఏడ్లమహేష్, సుందర్ రావు, సీఐలు ప్రమోద్ రావు, ప్రసాద్ రావు, వేణు గోపాల్, చంద్రశేఖర్, ఆర్ఐలు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్, సిసి మనోజ్ కుమార్ త‌దితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like