రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి

రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేయాలని మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి కోరారు. ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా బీజేపీ ఆధ్వ‌ర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ రైతుల వద్ద నుండి వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని రైతుల వద్ద నుండి పంటను కొనుగోలు చేసి ఎఫ్.సి.ఐ కు తరలించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పండించిన పంటను కొనుగోలు చేస్తుందని కానీ మన ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అబద్ధాలు చెప్పి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు . కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, పోనుగోటి రంగారావు, రజినిష్ జైన్, అందుగుల శ్రీనివాస్, అరుముళ్ల పోషం, తమ్మిడి శ్రీనివాస్, పత్తి శ్రీనివాస్, బొద్దున మల్లేష్, జొగుల శ్రీదేవి, పట్టి వెంకట కృష్ణ, బొడకుంట ప్రభ, లక్ష్మీనారాయణ, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బోలిషెట్టి తిరుపతి, గాజుల ప్రభాకర్, బోయిని హరికృష్ణ, వేల్పుల శ్రీనివాస్, విశ్వంభర్ రెడ్డి, మహంకాళి శ్రీనివాస్, పెద్దల సత్యం, పచ్చ వెంకటేశ్వర్లు, తాజ్ఖాన్, ప్రదీప్ చంద్ర, బొయిని దేవండర్, సత్యం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like