రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి

రెబల్ స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెబల్ స్టార్ వయస్సు 83 సంవత్సరాలు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పని చేశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు.

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. దాదాపు 183కు పైగా సినిమాల్లో రెబల్ స్టార్ నటించారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాల్లో ప్రవేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like