జ‌న‌వ‌రి 3న వేత‌న క‌మిటీ స‌మావేశం

జ‌న‌వ‌రి 3న జేబీసీసీఐ ప‌ద‌కొండవ వేత‌న క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు బీఎంఎస్ జాతీయ నాయ‌కుడు, బొగ్గు ప‌రిశ్ర‌మ‌ల ఇన్‌చార్జి కొత్త‌కాపు ల‌క్ష్మారెడ్డి వెల్ల‌డించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తాము వేత‌న ఒప్పందం కోసం అవ‌స‌ర‌మైతే స‌మ్మెకు సైతం సిద్ద‌మ‌ని యాజ‌మాన్యానికి ఆల్టిమేటం జారీ చేశామ‌న్నారు. అందుకే కోల్ఇండియా యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేసేందుకు అంగీక‌రించింద‌న్నారు.

కోల్ ఇండియా అపెక్స్ జేసీసీ సమావేశంలో లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ప‌లు డిమాండ్ల‌ను యాజ‌మాన్యం ముందుంచారు. కోల్ ఇండియా లాభాల్లో ప్రధాన వాటాదారులు (శాశ్వత, కాంట్రాక్ట్ కార్మికులు) వారి వాటా ఇవ్వాలని కోరారు. పారిశ్రామిక అశాంతి నివారించడానికి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి వెంటనే JBCCI సమావేశాన్ని పిలవాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కోసం బయోమెట్రిక్ హాజరు ఏర్పాటు చేయాల‌న్నారు. రికార్డులను CIL కంపెనీ, కాంట్రాక్టర్ ఇద్దరూ నిర్వహించాలని ఆయ‌న ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. హై పవర్ కమిటీ వేతనాలు ఖచ్చితంగా చెల్లించాలని, PLR ప్రతి సంవత్సరం చెల్లించాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా వైద్య సౌకర్యాలు కల్పించాలని, వారికి CMPF అమలు చేయాలన్నారు. ఇవ‌న్నీ అమలుచేసే బాధ్యత సంబంధిత GMల పైన ఉంచాలని అప్పుడే వారికి సరైన న్యాయం జ‌రుగుతుంద‌ని కొత్త‌కాపు ల‌క్ష్మారెడ్డి వెల్ల‌డించారు.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే, భర్త పదవీ విరమణ చేసిన తర్వాత, వారుండే క్వార్టర్ ఖాళీ చేయుమని ఉత్తర్వులు ఇవ్వకూడద‌న్నారు.
దుమ్ము కాలుష్యాన్ని నియంత్రించాలని, రోడ్ ట్రాన్స్పోర్ట్ ను తగ్గించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like