సింగ‌రేణి పిల్ల‌ల‌కు ఎంబీబీఎస్ సీట్ల‌లో రిజ‌ర్వేష‌న్‌

Singareni:రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 ఎంబీబీఎస్ సీట్లలో 5% సింగరేణి ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ ఇస్తారు. అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగులకు కేటాయించారు. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. సింగ‌రేణి వ్యాప్తంగా వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like